తెలంగాణ మహిళా ఉద్యమకారుల జేఏసీ కీలక తీర్మానాలు.. కేకే కమిటీలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్
టీజీ సమాచారం, హైదరాబాద్ :
తెలంగాణ మహిళా ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, శాంతియుత ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించవచ్చని పేర్కొన్నారు. కేకే కమిటీ 40 రోజుల్లో నివేదిక సమర్పించాలని, ప్రభుత్వం మూడు నెలల్లో ఉద్యమకారుల సంక్షేమంపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అలాగే హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కేటాయించాలని సూచించారు.తెలంగాణ జేఏసీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇప్పటికీ ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యమకారుల జేఏసీ చేపట్టే కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.రాష్ట్ర కన్వీనర్ అంబు రాథోడ్ మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. కేకే కమిటీలో మహిళా ఉద్యమకారులకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.సమావేశంలో ఆమోదించిన ప్రధాన తీర్మానాలు1969–2014 మధ్య తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అన్ని కేసులను ఉద్యమ కేసులుగా గుర్తించి ఉపసంహరించాలి.ఉద్యమ కేసుల పరిశీలనకు ఉన్నతస్థాయి లీగల్ కమిటీ ఏర్పాటు చేయాలి.తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్రకు అధికారిక గుర్తింపు ఇవ్వాలి.కేకే కమిటీలో మహిళా ఉద్యమకారులకు ప్రాతినిధ్యం కల్పించాలి.మహిళా ఉద్యమకారులకు పెన్షన్, ఆరోగ్య భద్రత, స్వయం ఉపాధి వంటి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలి.గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ మహిళా ఉద్యమకారుల జేఏసీ కమిటీలను ఏర్పాటు చేయాలి.ఉద్యమంలో పాల్గొన్న పేద మహిళా ఉద్యమకారులకు మిగిలి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలి.ఈ తీర్మానాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేసింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల మహిళా జేఏసీ అధ్యక్షురాలు బెల్లంకొండ జ్యోతి, ఉపాధ్యక్షురాలు పి. ధనలక్ష్మి, బీసీ రాజ్యాధికార సమితి సీఈవో పోశాల సరస్వతి, న్యాయవాదులు స్రవంతి, సవిత, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమారస్వామి, టీయూజాక్ కన్వీనర్ కె. శ్రీను, బీసీ రాజ్యాధికార ఉద్యమ నేత చాపర్తి కుమార్ గాడ్గే, అజ్మీరా జగన్, పుష్ప, సునీత, సౌజన్య, జగదేవి, అంబికా, వరలక్ష్మి, ప్రసాద్, రంజిత్, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.
