రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
హైదరాబాద్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళులర్పించారు.ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కల్లు వేములయ్య గౌడ్, బెల్లంకొండ జ్యోతి గౌడ్, గోశాల సరస్వతి గౌడ్, ప్రగతి గౌడ్, పద్మ గౌడ్, శైలజ గౌడ్, పుష్పనీలా గౌడ్, సతీష్ గౌడ్, పోషాల సరస్వతి, కురుల్ల వేమయ్య గౌడ్
తదితరులు పాల్గొన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా పలువురు కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


