IMG-20260727-WA1919

ప్రపంచ ప్రఖ్యాత నిపుణుల బృందం ఆధ్వర్యంలో శస్త్రచికిత్స – నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం

హైదరాబాద్, జూలై 27:

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు సమస్యకు తమిళనాడులోని కోయంబత్తూరు గంగా హాస్పిటల్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు.శస్త్రచికిత్స కోసం అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. డాక్టర్ ప్రవీణ్ భరద్వాజతో పాటు నిపుణుల బృందం కలిసి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.డాక్టర్ ఎస్. రాజశేఖరన్ గతంలో మెగాస్టార్ చిరంజీవికి క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.