IMG-20260727-WA2040

వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో శాస్త్రీయ సాగుకు దోహదం చేస్తున్న కార్యక్రమం

హైదరాబాద్, జూలై 27:

తెలంగాణ వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం మంగళవారం (జూలై 28) 100వ ఎపిసోడ్‌కు చేరుకోనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ప్రారంభమైన ఈ కార్యక్రమం రెండున్నరేళ్లుగా రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ ఉపయోగకరమైన వేదికగా కొనసాగుతోంది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికలను వ్యవసాయ శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసి పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, చీడపీడల నివారణ, పోషక నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై రైతులకు సూచనలు అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి, ఐఏఎస్ తెలిపారు.100వ ఎపిసోడ్ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నందున రైతులు తప్పనిసరిగా హాజరై నిపుణుల సూచనలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.