నల్లగొండ:
తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల ఫీజుల నియంత్రణ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోరుతూ సీఎం నివాస ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ముందస్తు అరెస్టులు చోటుచేసుకున్నాయి.హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు చర్యలు చేపట్టి పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టైన వారిలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు వర్ర వెంకటరెడ్డి, వడ్డే సతీష్ రెడ్డి, సురభి రాంబాబు, షేక్ హుస్సేన్, రావులపాటి ఎల్లయ్య ఉన్నారు.అలాగే బీఆర్ఎస్ నాయకులు పెరుమళ్ళ రాంబాబు, పగడోజు సైదాచారి, సీతారాల మహేష్, ధూపాటి మధుసూదన్ రాజు తదితరులను కూడా పోలీసులు ముందస్తుగా నిర్బంధించారు.ఈ అరెస్టుల నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.