యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల విస్తరణపై చర్చ
న్యూఢిల్లీ, జూలై 27:
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామితో కలిసి కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి, విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల విస్తరణ, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ATCs) ఏర్పాటు, ఐటీఐల బలోపేతం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా పథకాల సమర్థ అమలుపై చర్చించారు.స్థానిక యువతకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి, శిక్షణ అనంతరం పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా పెద్దపల్లి నియోజకవర్గంలో ATCs ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే మరిన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ, సర్టిఫికేషన్, ప్లేస్మెంట్ అవకాశాలను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.