IMG-20260617-WA0112

భద్రకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించిన పవన్ కళ్యాణ్

వరంగల్ భద్రకాళి ఆలయ దర్శనంఒడి బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించిన జనసేన అధినేత

అమ్మవారి వెండి ప్రతిమను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేత

వరంగల్, జూన్ 17 (టీజీ సమాచారం):

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్క ళ్యాన్ బుధవారం వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి టెంపుల్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి గతంలో చేసిన మొక్కులను చెల్లించుకునేందుకు ఆలయానికి వచ్చిన ఆయన భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.కొద్ది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న కొణిదెల భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు మొక్కుకున్నట్లు తెలిసింది. ఆ మొక్కులను తప్పనిసరిగా చెల్లించాలని ఆమె సూచించడంతో, ఒడి బియ్యం మరియు పట్టు వస్త్రాలను సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ అమ్మవారికి సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారులు అన్నా కొణిదెల గతంలో ఆలయానికి వచ్చి ప్రత్యేక అర్చనలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ అమ్మవారి వెండి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ ప్రతిమను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు.ఆలయ దర్శనం సందర్భంగా భక్తులు, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ రాకతో భద్రకాళి ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.