IMG_20260622_130337

సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి విజన్‌ను జీర్ణించుకోలేకపోతున్నారు

బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన భువనగిరి ఎంపీ

మెట్రో ఫేజ్-2, విద్య, రైతు సంక్షేమంపై ప్రభుత్వ కట్టుబాటు

హైదరాబాద్, జూన్ 22 (టీజీ సమాచారం):

భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు , మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్రె డ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ముందుకు సాగుతుంటే, దానిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు.విద్య, వైద్యం, రైతుల అభివృద్ధే లక్ష్యంఅంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వంటి కార్యక్రమాల ద్వారా విద్య, వైద్యం, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.బీఆర్ఎస్ పాలనపై విమర్శలుపదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ పాలనను “సూపర్ హిట్”గా చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని వ్యాఖ్యానించారు.మెట్రో ఫేజ్-2పై రాజకీయాలు వద్దుమెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ అంశంపై బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.హైడ్రాపై అపోహలు సృష్టిస్తున్నారుహైదరాబాద్ నగరాన్ని ముంపు సమస్యల నుంచి రక్షించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. నాళాలు, చెరువుల ఆక్రమణలను తొలగించడం ప్రజా ప్రయోజనాల కోసమేనని చెప్పారు. హైడ్రా పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు సరికాదన్నారు.బాధ్యతాయుత రాజకీయాలు చేయాలికేటీఆర్, హరీష్ రావు ప్రజల కోణంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, చిత్తశుద్ధి లేని విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.