IMG-20260629-WA0003

SIR జాబితాలో పేరు లేదన్న ఆందోళన.. వ్యక్తి ఆత్మహత్య

బోరబండ భరత్‌నగర్‌లో విషాద ఘటన

ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందిన కారు డ్రైవర్ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

హైదరాబాద్, జూన్ 19 (టీజీ సమాచారం):

హైదరాబాద్‌లోని బోరబండ భరత్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. SIR జాబితాలో తన పేరు లేదన్న ఆందోళనతో కారు డ్రైవర్ షేక్ ముజీబుర్ రహ్మాన్ (51) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.జైలుకు పంపుతారనే భయంతో మనస్తాపంకుటుంబ సభ్యుల కథనం ప్రకారం, SIR జాబితాలో పేరు లేకపోవడంతో తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో ముజీబుర్ రహ్మాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు ఏదైనా జరిగితే ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారంటూ భార్య వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.పత్రాల కోసం భారీగా ఖర్చుఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాల కోసం సుమారు రూ.1.5 లక్షలు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాస్‌పోర్ట్, ఆధార్, పిల్లల పత్రాల్లో పేర్లలో వ్యత్యాసాలు ఉండటంతో మరింత ఆందోళనకు గురైనట్లు సమాచారం. ఇద్దరు దివ్యాంగ పిల్లల భవిష్యత్తు గురించిన బెంగ కూడా ఆయనను తీవ్రంగా కలిచివేసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.దర్యాప్తు ప్రారంభించిన పోలీసులుభార్య ఎంత నచ్చజెప్పినా మనస్తాపం నుంచి బయటపడలేక ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.