IMG_20260728_001808

రక్తపు మరకలతో కత్తులు, దుస్తులు, యాక్టివా స్కూటర్ స్వాధీనం

హైదరాబాద్:

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల ఫైజ్ మహమ్మద్ అలియాస్ అజాన్ హత్య కేసును కలాపత్తర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, యాక్టివా స్కూటర్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 19 తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మహమ్మద్ అబ్రార్ (A1), మహమ్మద్ ఇస్మాయిల్ అలియాస్ ఫర్హాన్ (A2), మహమ్మద్ అష్ఫాక్ (A3) బిర్యానీషా టేక్రీ ప్రాంతానికి మరో వ్యక్తి కోసం వెళ్లారు. అక్కడ వారి రాకపై ప్రశ్నించిన ఫైజ్ మహమ్మద్‌పై A1, A2 కత్తులతో దాడి చేయగా, A3 పిడిగుద్దులతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, నిందితులు యాక్టివా స్కూటర్‌పై పరారయ్యారు.సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, శాస్త్రీయ దర్యాప్తు ఆధారంగా పోలీసులు జూలై 27న చాంద్రాయణగుట్ట సమీపంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై గతంలో కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కేసు దర్యాప్తును కలాపత్తర్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఖలీల్ పాషా నేతృత్వంలోని బృందం చేపట్టగా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.ఏ. జావీద్ బృందాన్ని అభినందించారు.