మహబూబ్‌నగర్‌లో పీఐబీ ‘వార్తాలాప్’ మీడియా వర్క్‌షాప్ ఏఐ జర్నలిజం, ఫ్యాక్ట్-చెకింగ్‌పై అవగాహన బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరమని నిపుణుల సూచన
మహబూబ్‌నగర్, జూన్ 20 (టీజీ సమాచారం):
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని ప్రముఖ జర్నలిస్టు ముద్దం నరసింహ స్వామి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ప్రచారంలో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో జిల్లా జర్నలిస్టుల కోసం ప్రత్యేక ‘వార్తాలాప్’ మీడియా వర్క్‌షాప్ నిర్వహించారు.పీఐబీ హైదరాబాద్ మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారిణి వర్గాంటి గాయత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా సంబంధాల అధికారి పి. శ్రీనివాస్ పాల్గొన్నారు.ఏఐ యుగంలో జర్నలిజానికి కొత్త సవాళ్లుప్రధాన వక్తగా పాల్గొన్న ముద్దం నరసింహస్వామి మాట్లాడుతూ, కృత్రిమ మేధ (AI) యుగంలో జర్నలిజం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు, పాత్రికేయుల బాధ్యతలపై సమగ్రంగా వివరించారు. డిజిటల్ సమాచార విప్లవం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వార్తల ప్రచురణకు ముందు వాస్తవ నిర్ధారణ (Fact-Checking) అత్యంత అవసరమని అన్నారు.ఫ్యాక్ట్-చెకింగ్‌పై ప్రత్యేక అవగాహనడిజిటల్ యుగంలో తప్పుడు సమాచార వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫ్యాక్ట్-చెకింగ్ ప్రాధాన్యంపై ఫ్యాక్ట్ చెక్ శిక్షకురాలు B.N. సత్యప్రియా ప్రత్యేక అవగాహన కల్పించారు. నైతిక విలువలు, ఖచ్చితత్వం, సమతుల్యతతో కూడిన వార్తా ప్రసారం ద్వారానే మీడియా విశ్వసనీయతను కాపాడుకోవచ్చని నిపుణులు సూచించారు.ప్రభుత్వ సమాచారానికి వంతెనగా పీఐబీఈ సందర్భంగా వర్గంటి గాయత్రి మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా, విశ్వసనీయంగా అందించడమే పీఐబీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారం చేరేలా చేయడంలో పీఐబీ వంతెనగా పనిచేస్తోందన్నారు.జిల్లా ప్రజా సంబంధాల అధికారి పీ. శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని సకాలంలో అందించడంలో మీడియా పాత్రను మరింత బలోపేతం చేసేందుకు ఇటువంటి వర్క్‌షాప్‌లు ఉపయోగపడతాయని తెలిపారు.