ప్రజా సేవ, సైబర్ నేరాల నియంత్రణ, కమ్యూనిటీ పోలీసింగ్‌పై అధికారులకు దిశానిర్దేశం
పరిగి, జూలై 27:
మల్టీ జోన్–II ఐజీపీ షహనవాజ్ ఖాసీం, ఐపీఎస్ పరిగి పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆయనకు స్వాగతం పలికి గౌరవ వందనం నిర్వహించారు.తనిఖీలో భాగంగా పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, విధి నిర్వహణ, ప్రజలతో వ్యవహరించే తీరు, పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, “వికారాబాద్ రక్షణ నేత్రం” సీసీటీవీ వ్యవస్థ, కేసు రికార్డులు, సీసీటీఎన్ఎస్, మహిళా సహాయ కేంద్రం, మాల్ఖానా, లాక్అప్ తదితర విభాగాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని, దర్యాప్తు నాణ్యతను మెరుగుపర్చాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, గోల్డెన్ అవర్‌లో బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ నెట్‌వర్క్‌ను సమర్థంగా వినియోగించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.