Screenshot_20240102_223433_WhatsAppBusiness

ఈనెల 16న భువనగిరి సుందరయ్య భవనంలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వక్వ్బొర్ద్ భూములపరిరక్షణకై జరిగే చర్చ గోష్టిని జయప్రదం చేయండి :ఎంఏ ఇగ్బాల్, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు

భువనగిరి/టిజి సమాచారం:

భువనగిరి సుందరయ్య భవనంలో ఆవాజ్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది .ఈ సమావేశానికి హాజరైన ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఇక్బాల్ మాట్లాడుతూ జిల్లాలో అనేకచోట్ల వక్బోర్డుకు సంబంధించిన భూముల పరిరక్షణకై ఈనెల 16న మైనారిటీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీలతో చర్చ గోష్టి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మైనార్టీలు తమ హక్కుల సాధన కోసం నిరంతరం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు అభివృద్ధి భద్రత సెక్యులరిజం నినాదాలతో ఆవాజ్ పనిచేస్తుందని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనారిటీ వ్యతిరేక మతత్వవాద వైఖరిని ఆవాజ్ నిరంతరం ఖండిస్తుందని అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మైనార్టీలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయని దీనికి వ్యతిరేకంగా ఆవాజ్ నిరంతరం జాతి మత విద్వేషాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్ ఆవాజ్ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎండి లతీఫ్ ఆవాజ్ జిల్లా నాయకులు ఎండి పాషా ఎండి యూసుఫ్ ఎండి ఇమామ్ పాషా ఎండి ఉమర్ ఎండి ముక్తార్ హుస్సేన్ ఎండి ఆఫాన్ అబ్దుల్ హైదర్ తదితరులు పాల్గొన్నారు