Screenshot_20231221_172331_WhatsAppBusiness

మృతుడు భిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహకారం అందించిన యువజన కాంగ్రెస్ నాయకులు నరేష్

ఆలేరు , టి జి సమాచారం

ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఉగ్గే భిక్షపతి కుటుంబానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, సర్పంచ్ జన్నాయికోడె నగేష్ గార్ల చేతుల మీదుగా 10,000 రు.ల ఆర్థిక సహకారం అందించిన యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు సారగండ్ల నరేష్ గారు బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, సీపీఎం కార్యదర్శి రాచమల్ల సత్తయ్య, నాయకులు ఎద్దు వెంకటేశ్వర్లు, రంగ శ్రీను, గూడపూరి స్వామి, లోడి మహేష్, పైళ్ళ రాజు, కమిటికారి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.